Telugu Global
NEWS

ఎన్నికల ఖర్చుకు పార్టీ ఓకే.... ఇక పోటీకి వాళ్ళూ రెడీ

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతా అయోమ‌యంగా ఉంది. ఎప్పుడు ఏ క్యాండిడేట్ అస్త్ర స‌న్యాసం చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. నోటిఫికేష‌న్ రాక‌ముందే కొంద‌రు ఎంపీ అభ్య‌ర్థులు ఈ సారి పోటీ చేయ‌మ‌ని చంద్ర‌బాబుకు తేల్చి చెప్పారు. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన త‌ర్వాత కొంద‌రు పోటీ చేయ‌బోమ‌ని అంటున్నారు. ఎందుకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి ఇద్ద‌రూ పోటీ చేసేందుకు రెడీగా లేరు. అయితే […]

ఎన్నికల ఖర్చుకు పార్టీ ఓకే....  ఇక పోటీకి వాళ్ళూ రెడీ
X

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతా అయోమ‌యంగా ఉంది. ఎప్పుడు ఏ క్యాండిడేట్ అస్త్ర స‌న్యాసం చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. నోటిఫికేష‌న్ రాక‌ముందే కొంద‌రు ఎంపీ అభ్య‌ర్థులు ఈ సారి పోటీ చేయ‌మ‌ని చంద్ర‌బాబుకు తేల్చి చెప్పారు. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన త‌ర్వాత కొంద‌రు పోటీ చేయ‌బోమ‌ని అంటున్నారు. ఎందుకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది.

క‌ర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి ఇద్ద‌రూ పోటీ చేసేందుకు రెడీగా లేరు. అయితే వీరికి హైద‌రాబాద్‌లో ఆస్తులు ఉన్నాయ‌ని… అక్క‌డి ప్ర‌భుత్వం బెదిరించ‌డం వ‌ల్లే వీరు పోటీకి వెనుకంజ వేస్తున్నార‌ని టీడీపీ అనుకూల మీడియా స్టోరీలు అల్లింది. కానీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం వేరేగా క‌నిపిస్తోంది.

బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్‌రెడ్డి మంచి వ్యాపార‌వేత్త‌. వ్యాపార మెళకువ‌లు తెలిసిన జ‌నార్థ‌న్‌రెడ్డి మాత్రం ఓట‌మి భ‌యంతోనే ఇప్పుడు పోటీ చేయ‌న‌ని అన్నాడ‌ని తెలుస్తోంది.

అంతేకాకుండా ….మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి మొన్నే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ నియోజక వర్గంలో అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను శాసించే ఈయ‌న చేరిక జ‌నార్థ‌న్‌ రెడ్డికి వ‌ణుకు పుట్టిస్తోంది. నంద్యాల ఎంపీగా బిజ్జం పార్థ‌సార‌థి రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాల‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి ష‌ర‌తు పెట్టారు. ఆయ‌నైతే ఎన్నిక‌ల ఖ‌ర్చు భ‌రిస్తార‌ని అనుకున్నారు. కానీ తీరా చూస్తే న‌యీం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న శివానంద రెడ్డి ఎంపీ అభ్యర్థిగా వ‌చ్చాడు.

దీంతో అటు డ‌బ్బు విష‌యంలో… ఇటు వ‌ర్గం విష‌యంలో తేడా రావ‌డంతోనే ఆయ‌న పోటీకి వెనుకంజ వేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం క‌ళ్ల ముందే క‌నిపిస్తుండ‌డంతో… అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్లు “డబ్బులు ఊరకే రావు”…. అనవసరంగా 20 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ఎందుకు అని వ్యాపార‌వేత్త ఆలోచ‌న వల్లే జ‌నార్థ‌న్‌రెడ్డి పోటీకి ముందుకు రావ‌డం లేద‌నేది నిజం. ఇప్పుడు శివానందారెడ్డితో చంద్ర‌బాబు డీల్ కుద‌ర్చ‌డం వ‌ల్లే మ‌ళ్లీ పోటీకి ముందుకు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ళ్లీ గెలుపుపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల ఖ‌ర్చు పార్టీ భ‌రిస్తుంద‌ని చెప్ప‌డంతో పోటీ చేస్తాన‌ని రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి పైకి చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

First Published:  20 March 2019 1:54 AM GMT
Next Story