Telugu Global
Cinema & Entertainment

మజిలి... మ్యూజిక్ గోపిసుందర్... రీ రికార్డింగ్ థమన్...

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఈ పాటికీ పూర్తి కాగా, చిత్ర వర్గాలు రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకి ముందుగా గోపి సుందర్ ని సంగీత దర్శకుడి గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. గోపి సుందర్ ఈ సినిమా దర్శకుడు శివ మొదటి చిత్రం ‘నిన్నుకోరి’ కి కూడా పనిచేయడంతో ఈజీ గా ఉంటుందని దర్శకుడు అతడిని […]

మజిలి... మ్యూజిక్ గోపిసుందర్... రీ రికార్డింగ్ థమన్...
X

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఈ పాటికీ పూర్తి కాగా, చిత్ర వర్గాలు రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమాకి ముందుగా గోపి సుందర్ ని సంగీత దర్శకుడి గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. గోపి సుందర్ ఈ సినిమా దర్శకుడు శివ మొదటి చిత్రం ‘నిన్నుకోరి’ కి కూడా పనిచేయడంతో ఈజీ గా ఉంటుందని దర్శకుడు అతడిని తీసుకున్నాడు.

కాగా సినిమా ఆడియో ఆల్బమ్ రెడీ చేశాక…. గోపి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. తన పర్సనల్ రీజన్స్ వలన ఈ సినిమా నుండి తప్పుకుంటున్నానని…. సినిమా రీ రికార్డింగ్ వేరే ఎవరితో అయినా చేయించుకొమ్మని సూచించాడట.

అయితే సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండటంతో ఆలస్యం చేయకుండా చిత్ర వర్గాలు వెంటనే థమన్ ని అప్రోచ్ అయ్యారట. థమన్ కూడా వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. ఆల్రెడీ థమన్ వర్క్ స్టార్ట్ చేసేసాడు కూడా. ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల కానున్నది .

First Published:  20 March 2019 4:08 AM GMT
Next Story