ప్లే బాయ్ కాదట….

కేవలం ‘ఆర్ఎక్స్ 100’ అనే ఒకే ఒక్క సినిమాతో యువహీరో కార్తికేయ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తికేయ ‘హిప్పీ’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

టీ ఎన్ కృష్ణ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తో హిందీ సీరియల్ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది.

తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో లో కార్తికేయ సరికొత్త లుక్ తో కనిపిస్తాడు. వెన్నెల కిషోర్, కార్తికేయ మధ్య మాటలు బాగుంటాయి. ఒక పక్క హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ వేరే అమ్మాయిని లైన్ లో పెడుతూ కనిపించాడు కార్తికేయ. తను ప్లే బాయ్ కాదు లవర్ బాయ్ ని అని సంజాయిషీ ఇస్తున్నాడు కార్తికేయ.

ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ తాను ఏషియన్ సినిమాస్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్ లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి  కార్తికేయ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి…!