Telugu Global
NEWS

సీఎం నివాసంలో కొట్టుకున్న మాచర్ల టీడీపీ కీలక నేతలు

గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో టీడీపీలో కొట్లాట కొనసాగుతూనే ఉంది. సీఎం నివాసం వద్ద అసంతృప్తి వర్గం ఆందోళనకు దిగింది. ఏకంగా నేతలే తన్నుకున్నారు. టికెట్ విషయంలో మాట్లాడేందుకు ఇరు వర్గాలను చంద్రబాబు పిలిపించారు. సమావేశానికి రాయపాటి, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత లక్ష్మారెడ్డి మాట్లాడబోయారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన చలమారెడ్డి… నీవు నాకు చెప్పేదేంట్రా అంటూ లక్ష్మారెడ్డిని కొట్టారు. సమావేశం నుంచి చలమా రెడ్డి ఆగ్రహంగా బయటకు వచ్చేశారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి […]

సీఎం నివాసంలో కొట్టుకున్న మాచర్ల టీడీపీ కీలక నేతలు
X

గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో టీడీపీలో కొట్లాట కొనసాగుతూనే ఉంది. సీఎం నివాసం వద్ద అసంతృప్తి వర్గం ఆందోళనకు దిగింది. ఏకంగా నేతలే తన్నుకున్నారు.

టికెట్ విషయంలో మాట్లాడేందుకు ఇరు వర్గాలను చంద్రబాబు పిలిపించారు. సమావేశానికి రాయపాటి, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత లక్ష్మారెడ్డి మాట్లాడబోయారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన చలమారెడ్డి… నీవు నాకు చెప్పేదేంట్రా అంటూ లక్ష్మారెడ్డిని కొట్టారు.

సమావేశం నుంచి చలమా రెడ్డి ఆగ్రహంగా బయటకు వచ్చేశారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తామంటూ శపథం చేసి వెళ్లిపోయారు.

First Published:  20 March 2019 9:12 AM GMT
Next Story