Telugu Global
Cinema & Entertainment

మళ్లీ తెలుగు తెరపైకి 'లై' బ్యూటీ 

గత కొంతకాలంగా యువ హీరో రాజ్ తరుణ్ ఒక్క హిట్ సినిమాను కూడా అందుకోలేదు. ‘సినిమా చూపిస్తా మామా’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి హిట్ చిత్రాలను కెరీర్ మొదట్లో అందున్న రాజ్ తరుణ్…. గత రెండేళ్లుగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే ‘లవర్’ అనే సినిమాలో కనిపించిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు […]

మళ్లీ తెలుగు తెరపైకి లై బ్యూటీ 
X

గత కొంతకాలంగా యువ హీరో రాజ్ తరుణ్ ఒక్క హిట్ సినిమాను కూడా అందుకోలేదు. ‘సినిమా చూపిస్తా మామా’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి హిట్ చిత్రాలను కెరీర్ మొదట్లో అందున్న రాజ్ తరుణ్…. గత రెండేళ్లుగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు.

ఈ మధ్యనే ‘లవర్’ అనే సినిమాలో కనిపించిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

‘లవర్’ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.

‘లై’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘చల్ మోహన్ రంగా’ సినిమా తర్వాత కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ పేరు తెచ్చుకున్న మేఘ ఆకాష్ ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ సరసన తెలుగు సినిమా లో నటించబోతోంది.

కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ చిత్రంతో నైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

First Published:  20 March 2019 1:59 AM GMT
Next Story