మళ్ళీ భయపెట్టనున్న నయనతార

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ‘డోరా’ సినిమా తర్వాత ఇప్పుడు మరొక హారర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఐరా’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ లో కనిపించనుంది.

ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కే. ఎం. సర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి ప్రయత్నించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో నయనతార రిపోర్టర్ పాత్రలో కనిపిస్తోంది.

వారున్న చోట దయ్యం ఉందని ప్రూఫ్ చేసి…. లైవ్ గోస్ట్ ఎక్స్ పీరియన్స్ అన్న వీడియోని ఇంటర్ నెట్లో పెట్టాలని ప్రయత్నం మొదలు పెట్టిన నయనతారకు నిజంగానే దెయ్యం ఎదురవుతుంది. ఆ దెయ్యం ఎవరు? నయనతార మొదలుపెట్టిన పనిని నయనతార ఎలా పూర్తి చేసింది? అనేది తెరపై సినిమాలో చూడాల్సి ఉంది.

కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపది జే రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28వ తారీఖున విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నయన్ ప్రేక్షకులను ఎంత వరకు భయపెట్టి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.