Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్... ఒకేసారి రెండు సినిమాలు

తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ ఒకేసారి 2 సినిమాలు సమాంతరంగా చేయలేదు ప్రభాస్. కానీ బాహుబలి సిరీస్ సృష్టించిన గ్యాప్ ను భర్తీ చేసేందుకు ఇప్పుడు ఒకేసారి 2 సినిమాల్ని పట్టాలపైకి తీసుకొచ్చాడు. పైగా సాహో సినిమా కూడా లేట్ అవ్వడంతో, తన నెక్ట్స్ మూవీని కూడా ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు ప్రభాస్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో చాన్నాళ్ల కిందటే ఓ సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఆ మూవీకి సంబంధించి పారిస్ లో ఓ […]

ప్రభాస్... ఒకేసారి రెండు సినిమాలు
X

తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ ఒకేసారి 2 సినిమాలు సమాంతరంగా చేయలేదు ప్రభాస్. కానీ బాహుబలి సిరీస్ సృష్టించిన గ్యాప్ ను భర్తీ చేసేందుకు ఇప్పుడు ఒకేసారి 2 సినిమాల్ని పట్టాలపైకి తీసుకొచ్చాడు. పైగా సాహో సినిమా కూడా లేట్ అవ్వడంతో, తన నెక్ట్స్ మూవీని కూడా ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు ప్రభాస్.

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో చాన్నాళ్ల కిందటే ఓ సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఆ మూవీకి సంబంధించి పారిస్ లో ఓ షెడ్యూల్ కూడా నడిచింది. ఇప్పుడా సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో గురువారం నుంచి ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

అన్నపూర్ణలో ఏకథాటిగా 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ నడుస్తుంది. ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటారు. 1960 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

First Published:  19 March 2019 8:01 PM GMT
Next Story