Telugu Global
NEWS

సీట్లు ఇవ్వరు.... ఓట్లు కావాలా?

“ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలందరికీ నేను అన్నయ్యని…. మీకు పసుపు కుంకుమ కింద కానుకలు ఇస్తున్నాను.” ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలలో చేస్తున్న ప్రసంగాలు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరిని తాను ఆదుకుంటానని చెబుతున్న చంద్రబాబు పార్టీలో ఎన్నాళ్లుగానో సేవ చేస్తున్న తెలుగు మహిళల పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారని తెలుగు చెల్లెళ్లు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలకు […]

సీట్లు ఇవ్వరు.... ఓట్లు కావాలా?
X

“ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలందరికీ నేను అన్నయ్యని…. మీకు పసుపు కుంకుమ కింద కానుకలు ఇస్తున్నాను.” ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలలో చేస్తున్న ప్రసంగాలు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరిని తాను ఆదుకుంటానని చెబుతున్న చంద్రబాబు పార్టీలో ఎన్నాళ్లుగానో సేవ చేస్తున్న తెలుగు మహిళల పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారని తెలుగు చెల్లెళ్లు మండిపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక పథకాలు అందిస్తున్నామని ఊదర కొడుతున్నారు. అయితే వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉందని పార్టీలోని తెలుగు మహిళ విభాగ నాయకురాళ్లు మండిపడుతున్నారు.

మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడంతో పాటు అధికారంలోకి వచ్చాక పదవులు కట్టబెట్టడంలో కూడా చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని విమర్శిస్తున్నారు. సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకుండా వారి స్దానంలో ఇంకొకరిని పోటీకి నిలపడం మహిళలపై ఎలాంటి గౌరవం చూపించడమని ప్రశ్నిస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు మొండి చెయి చూపించారు చంద్రబాబు నాయుడు. ఆమెకు టిక్కెట్టు ఇవ్వరాదని పార్టీ ఎంపీ జెసీ. దివాకర్ రెడ్డి చేసిన వత్తిడికి చంద్రబాబు నాయుడు తలొగ్గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే యామిని బాలపై జెసీ దివాకర్ రెడ్డి అరుపులు కేకలతో మండిపడ్డా చంద్రబాబు మిన్నకుండిపోయారని అంటున్నారు.

ఇక విజయనగరం జిల్లాకు చెందిన మీసాల గీతకు కూడా టిక్కెట్టు ఇవ్వకుండా అవమానించారని అంటున్నారు. మీసాల గీత పార్టీ సీనియర్ నాయకుడు ఆశోక్ గజపతి రాజు వద్ద కన్నీటి పర్యంతమైనా పట్టించుకోలేదని అంటున్నారు.

మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను, పార్టీ కచ్చితంగా ఓడిపోయే కొవ్వురు నియోజకవర్గానికి మార్చారని మండిపడుతున్నారు. చర్చ గోష్టులలోను, ఇతర కార్యక్రమాలలోను మహిళల ఓట్ల కోసం తెలుగు చెల్లెళ్లను వాడుకునే చంద్రబాబుకు టిక్కెట్ల సమయంలో తాము గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఆనాటి జయప్రద, రోజా, కవిత, నందమూరి సుహాసిని నుంచి నేటి మహిళా నాయకురాళ్ల వరకూ అందరిని వాడుకుని వదిలేయడమే చంద్రబాబు నైజం అని మండిపడుతున్నారు.

First Published:  20 March 2019 3:12 AM GMT
Next Story