Telugu Global
NEWS

మంత్రికి చెందిన.... కోటి రూపాయలు పట్టివేత

విశాఖ జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది. సబ్బవరంలో కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు విశాఖకు చెందిన ఒక మంత్రిదిగా భావిస్తున్నారు. నగదు పట్టుబడిన కారు టీడీపీ నేతది. డబ్బు పట్టుబడడంతో సొమ్ము గ్రామీణ బ్యాంకుదంటూ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే బ్యాంకు డబ్బును టీడీపీ నేత కారులో ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే…. అందుకు సమాధానం లేదు. అలాగే ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నట్టుగానే భావిస్తున్నారు. వెంటనే టీడీపీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో […]

మంత్రికి చెందిన.... కోటి రూపాయలు పట్టివేత
X

విశాఖ జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది. సబ్బవరంలో కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు విశాఖకు చెందిన ఒక మంత్రిదిగా భావిస్తున్నారు.

నగదు పట్టుబడిన కారు టీడీపీ నేతది. డబ్బు పట్టుబడడంతో సొమ్ము గ్రామీణ బ్యాంకుదంటూ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే బ్యాంకు డబ్బును టీడీపీ నేత కారులో ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే…. అందుకు సమాధానం లేదు. అలాగే ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నట్టుగానే భావిస్తున్నారు.

వెంటనే టీడీపీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో …మీడియాకు వివరాలు చెప్పకుండా పోలీసులు దాటవేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.

First Published:  19 March 2019 11:04 PM GMT
Next Story