Telugu Global
NEWS

జగనన్న సీఎం కావాలన్నదే మా నాన్న ఆశయం " వివేకా కుమార్తె

తండ్రిని కోల్పోయి తామంతా చాలా బాధలో ఉన్నామన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత . కానీ హత్య జరిగిన తర్వాత కొన్ని పేపర్లలో, టీవీల్లో వస్తున్న కథనాలు చూస్తుంటే మరింత బాధ కలుగుతోందన్నారు. చనిపోయిన వ్యక్తి పైనా రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. సరైన దర్యాప్తు జరక్కపోవడం మరింత ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని గుర్తించకుండా ఏవేవో చెబుతున్నారన్నారు. సిట్‌ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వ పెద్దలు తీర్పులు చెబుతుంటే ఇక దర్యాప్తు నిజాయితీగా ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్ […]

జగనన్న సీఎం కావాలన్నదే మా నాన్న ఆశయం  వివేకా కుమార్తె
X

తండ్రిని కోల్పోయి తామంతా చాలా బాధలో ఉన్నామన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత . కానీ హత్య జరిగిన తర్వాత కొన్ని పేపర్లలో, టీవీల్లో వస్తున్న కథనాలు చూస్తుంటే మరింత బాధ కలుగుతోందన్నారు.

చనిపోయిన వ్యక్తి పైనా రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. సరైన దర్యాప్తు జరక్కపోవడం మరింత ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని గుర్తించకుండా ఏవేవో చెబుతున్నారన్నారు. సిట్‌ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వ పెద్దలు తీర్పులు చెబుతుంటే ఇక దర్యాప్తు నిజాయితీగా ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలన్నది తన తండ్రి ఆశయమని ఆమె చెప్పారు.

తమ ఫ్యామిలీలో 700 మందికి పైగా మనుషులున్నారన్నారు. తమ కుటుంబంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని తాము గౌరవిస్తామని చెప్పారు. పరిపక్వత లేని వారే తమ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని సునీత మండిపడ్డారు.

దర్యాప్తు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు పదేపదే తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని పరోక్షంగా ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. పెద్దలే ఇలా మాట్లాడితే దాని ప్రభావం ఎంతగా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు. అలా చేయడం సరికాదన్నారు. తన తల్లికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో, తరచూ ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో వివేకాకు దూరంగా తన వద్ద ఉంటోందన్నారు. తన తండ్రి వద్ద ఉన్న సన్నిహితులంతా ఆయన్ను బాగా చూసుకునేవారని చెప్పారు.

First Published:  19 March 2019 11:42 PM GMT
Next Story