Telugu Global
NEWS

వివేకానంద రెడ్డిని హత్య చేయించింది చంద్రబాబే

తన బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. విలన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ చంద్రబాబుకు ఉన్నాయన్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు జగన్‌. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. తన అధికారానికి అడ్డు వస్తే ఎవరినైనా చంపించే వ్యక్తిత్వం చంద్రబాబుదన్నారు. స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతాడని జగన్ ఫైర్ అయ్యారు. బాబుకు ఓటేస్తే హత్యా రాజకీయాలకు ఓటేసినట్టేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనని జగన్‌ ఆరోపించారు. ఇప్పుడు […]

వివేకానంద రెడ్డిని హత్య చేయించింది చంద్రబాబే
X

తన బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. విలన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ చంద్రబాబుకు ఉన్నాయన్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు జగన్‌.

సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. తన అధికారానికి అడ్డు వస్తే ఎవరినైనా చంపించే వ్యక్తిత్వం చంద్రబాబుదన్నారు. స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతాడని జగన్ ఫైర్ అయ్యారు. బాబుకు ఓటేస్తే హత్యా రాజకీయాలకు ఓటేసినట్టేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనని జగన్‌ ఆరోపించారు.

ఇప్పుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. తప్పు చేయకుంటే, హత్య వెనుక చంద్రబాబు పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నేరగాడు కాబట్టే
సీబీఐ, ఈడీలకు భయపడుతున్నారన్నారు. చంద్రబాబు నేరగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వస్తారని నిలదీశారు. తప్పు చేయకపోతే 19 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును మించిన దుర్మార్గుడు లేడని
ఎన్టీఆరే చెప్పారని గుర్తు చేశారు. రిషితేశ్వరి కేసును నీరుగార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

రిషితేశ్వరి కేసులో బాబురావును తప్పించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొడితే చర్యలేవి అని అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో మృగాలను కాపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై నిలదీసినందుకు రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారన్నారు.

కాపులు, నాయి బ్రహ్మణులు, మత్స్యకారులను, ముస్లింలను, అగ్రిగోల్డ్ బాధితులను కొట్టించి వేధించింది చంద్రబాబు కాదా అని జగన్ తన ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించారు. పట్టపగలు చెరుకులపాడు నారాయణరెడ్డిని నరికి చంపించింది చంద్రబాబు కాదా అని జగన్ నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారని జగన్ ఫైర్ అయ్యారు.

First Published:  20 March 2019 6:51 AM GMT
Next Story