ఏప్రిల్‌ 9న తనకు ఓటేయాలన్న లోకేష్….

నారా లోకేష్ స్పీచ్‌లు చూసి టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. లోకేష్ మైక్ తీసుకుంటే ఏం మాట్లాడుతారో అని ప్రసంగం పూర్తయ్యే వరకు ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు.

వివేకానందరెడ్డి చనిపోతే పరవశించా అని మాట్లాడడం, మంగళగిరి పదాన్ని మందలగిరి అని పిలవడం, టీడీపీ 1980లోనే స్థాపించినట్టు మాట్లాడడం…. వంటివి నారాలోకేష్ మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి పేలిన డైలాగులు.

తాజాగా మరో ఆణిముత్యం లోకేష్ నోటి నుంచి వచ్చింది. ఏపీలో ఏప్రిల్‌ 11న పోలింగ్ జరుగుతుంటే… నారా లోకేష్ మాత్రం ఏప్రిల్‌ 9న పోలింగ్ జరుగుతుందని… అందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని మంగళగిరి ప్రజలను కోరారు.

దాంతో వెంటనే పక్కనే ఉన్న చోటా నేత ఒకరు అప్రమత్తమయ్యారు. పోలింగ్ ఏప్రిల్‌ 11న అని గుర్తు చేశారు. దాంతో లోకేష్ తత్తరపాటుకు గురయ్యాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది.

లోకేష్ వ్యవహారం ఇలాగే ఉంటే మంగళగిరి ప్రజలు ఓటు ఎలా వేస్తారని టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు.