అమర చిత్ర కథ తో రానా కొత్త వ్యాపారం

కథలంటే మనకి ఎప్పటికీ గుర్తొచ్చేది అమర చిత్ర కథ.అమర చిత్ర కథ కామిక్ పుస్తకాలంటే ఇప్పటికీ చాలా మందికి ఎనలేని మక్కువ.

అయితే రానా దగ్గుబాటి ఇప్పుడు అమర చిత్ర కథ తో ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నాడు. రామానాయిడు స్టూడియోస్ పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ తీసుకొని దాన్ని ఒక ఆధునిక లెర్నింగ్ సెంటర్ కింద తయారు చేసాడు. అందులో అమర చిత్ర కథ కి సంబంధించిన కథలు, వాటికి సంబంధించిన అనేక మైన విషయాలను పొందు పరిచారు.

ఈ రోజు ఉదయం రానా తన సోషల్ మీడియా లో దీని గురించి అనౌన్స్ చేసి ఆ సెంటర్ కి సంబందించిన టీజర్ కూడా విడుదల చేశారు.

“మనకి చిన్నప్పుడు అమర చిత్ర కథ పుస్తకాలు మంచి కంపెనీ ని అందించాయి. ఇప్పుడు అవి ఒక సరికొత్త రూపు దాల్చినాయి. ఈ మా సెంటర్ ద్వారా భారతీయ విలువలను ముందుకు తీసుకొని వెళ్లాలనే ధ్యేయం తో మేము పనిచేస్తున్నాం. మిగిలిన వివరాలు త్వరలో చెప్తాము” అని చెప్పాడు రానా.