మరో హీరోయిన్ పెళ్లికి రెడీ?

అవును.. బాలీవుడ్ నుంచి మరో బ్యూటీ పెళ్లికి సిద్ధమైంది. ఆమె పేరు శ్రద్ధాకపూర్. ప్రస్తుతం ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటిస్తున్న ఈ చిన్నది, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతోందంటూ రూమర్లు వస్తున్నాయి. వాటిని శ్రద్ధా కూడా ఖండించకపోవడంతో పుకార్లు ఇంకాస్త ఎక్కువయ్యాయి.

కెరీర్ స్టార్టింగ్ లో ఫర్హాన్ అక్తర్ తో ఎఫైర్ సాగించింది శ్రద్ధాకపూర్. వీళ్లిద్దరూ అప్పట్లో డేటింగ్ లో ఉండేవారు. కానీ ఆ రిలేషన్ షిప్ పెద్దగా పండలేదు. ఆ తర్వాత తన చిన్నప్పటి ఫ్రెండ్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠ్ తో డేటింగ్ స్టార్ట్ చేసిందట శ్రద్ధ. వచ్చే ఏడాది ప్రధమార్థంలో అతడ్నే పెళ్లి చేసుకుంటుందంటూ కథనాలు వస్తున్నాయి.

శ్రద్ధాకపూర్ పై ఇంతలా పుకార్లు రావడానికి మరో రీజన్ కూడా ఉంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి ఈమె తప్పుకుంది. కేవలం పెళ్లి కోసమే ప్రతిష్టాత్మకమైన సినిమాను ఆమె వదులుకుందంటున్నారు చాలామంది.

కరీనా, సోనమ్, నేహా ధూపియా, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా.. ఇలా చాలామంది ముద్దుగుమ్మలు ఈమధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి శ్రద్ధాకపూర్ కూడా చేరబోతోందన్నమాట.