Telugu Global
Cinema & Entertainment

వెంకీ, వీరుపోట్ల సినిమా లేనట్టే!

వీరు పోట్ల దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా మల్టీస్టారర్. అందులో వెంకీతో పాటు రానా లేదా రవితేజ హీరోగా నటించే ఛాన్స్ ఉందట. 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకారు ఇది. దీనిపై వీరుపోట్ల క్లారిటీ ఇచ్చాడు. అసలు అలాంటి ప్రాజెక్టు లేదని కొట్టిపారేశాడు. వీరుపోట్ల కొట్టిపడేసినా ఇందులో కాస్త నిజముంది. నిర్మాత అనీల్ సుంకరకు వెంకీ ఓ సినిమా చేసిపెట్టాలి. ఈ మేరకు అనీల్ సుంకర ఇచ్చిన అడ్వాన్స్ […]

వెంకీ, వీరుపోట్ల సినిమా లేనట్టే!
X

వీరు పోట్ల దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా మల్టీస్టారర్. అందులో వెంకీతో పాటు రానా లేదా రవితేజ హీరోగా నటించే ఛాన్స్ ఉందట. 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకారు ఇది. దీనిపై వీరుపోట్ల క్లారిటీ ఇచ్చాడు. అసలు అలాంటి ప్రాజెక్టు లేదని కొట్టిపారేశాడు.

వీరుపోట్ల కొట్టిపడేసినా ఇందులో కాస్త నిజముంది. నిర్మాత అనీల్ సుంకరకు వెంకీ ఓ సినిమా చేసిపెట్టాలి. ఈ మేరకు అనీల్ సుంకర ఇచ్చిన అడ్వాన్స్ వెంకీ వద్ద ఉంది. ఇందులో భాగంగా తేజతో సినిమా అనుకుంటే అది రద్దయింది. మధ్యలో వీరభద్రమ్ చౌదరితో ఓ సినిమా అనుకున్నారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా అనీల్ సుంకర రిఫరెన్స్ తో వీరుపోట్ల కూడా వెళ్లి వెంకీకి ఓ కథ చెప్పాడు.

జస్ట్ ఇక్కడివరకు మాత్రమే మేటర్ నడించింది. అంతలోనే ఓ సెన్షన్ మీడియా ఏవేవో కథలు అల్లేసింది. నిజానికి వెంకీకి వీరుపోట్ల చెప్పింది మల్టీస్టారర్ కథ కాదట. ఆ సంగతి పక్కనపెడితే, వీరుపోట్ల చెప్పిన లైన్ కు వెంకీ నో చెప్పాడట. అందుకే తను వెంకీకి ఎలాంటి స్టోరీ చెప్పలేదంటూ కవర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు వీరు పోట్ల.

First Published:  20 March 2019 9:35 PM GMT
Next Story