Telugu Global
Cinema & Entertainment

'ఆర్ ఆర్ ఆర్' తర్వాత చెర్రీ చేయబోయే సినిమా ఇదే..!

‘రంగస్థలం’ సినిమాతో టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా ఒకవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో హీరోగా, మరోవైపు చిరంజీవి ‘సైరా’ సినిమాకు నిర్మాతగా బిజీగా ఉన్న చెర్రీ ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ గీతా ఆర్ట్స్ పతాకంపై ఒక సినిమా చేయనున్నాడట. చాలాకాలం […]

ఆర్ ఆర్ ఆర్ తర్వాత చెర్రీ చేయబోయే సినిమా ఇదే..!
X

‘రంగస్థలం’ సినిమాతో టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా ఒకవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో హీరోగా, మరోవైపు చిరంజీవి ‘సైరా’ సినిమాకు నిర్మాతగా బిజీగా ఉన్న చెర్రీ ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ గీతా ఆర్ట్స్ పతాకంపై ఒక సినిమా చేయనున్నాడట. చాలాకాలం నుంచి గీత ఆర్ట్స్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న అతను ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు.అతను రామ్ చరణ్ కోసం ఒక అదిరిపోయే కథ రాశాడని తెలుస్తోంది. కథ బాగుండటంతో దర్శకత్వం వహించే బాధ్యత కూడా అతనికే ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. అన్నీ ఓకే అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. చెర్రీ సరసన ఈ సినిమాలో అలియా భట్, ఎన్టీఆర్ పక్కన డైజీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారు.

First Published:  22 March 2019 1:52 AM GMT
Next Story