Telugu Global
National

నేడు అతిరథుల నామినేషన్

శుక్రవారం. ఫాల్గుణ మాసం. విదియా తిథి. హస్త నక్షత్రం. ఇన్ని శుభాలు కలసిన రోజు కాబట్టే ఎన్నికల పోరులో రసవత్తర ఘట్టానికి తెర లేస్తోంది.  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అతిరధ మహారధులైన ఉద్దండులు నేడు తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండడంతో ఆయన తరఫున చంద్రబాబు సతీమణీ భువనేశ్వరి […]

నేడు అతిరథుల నామినేషన్
X

శుక్రవారం. ఫాల్గుణ మాసం. విదియా తిథి. హస్త నక్షత్రం. ఇన్ని శుభాలు కలసిన రోజు కాబట్టే ఎన్నికల పోరులో రసవత్తర ఘట్టానికి తెర లేస్తోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అతిరధ మహారధులైన ఉద్దండులు నేడు తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండడంతో ఆయన తరఫున చంద్రబాబు సతీమణీ భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ స్దాయిలో పాల్గొంటారని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మంగళగిరి అభ్యర్దిగా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరో నాయకుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన రెండో నియోజక వర్గమైన భీమవరం నుంచి శుక్రవారం నాడు నామినేషన్ వేయనున్నారు.

విశాఖపట్నం లోక్ సభ జనసేన అభ్యర్దిగా సీబీఐ మాజీ డైరెక్టర్ జె.డి లక్ష్మీ నారాయణ ఈరోజు నామినేషన్ వేస్తారు. ఇక ఏపీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు కూడా శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణలో నిజామాబాద్ లోక్ సభ స్దానం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు లోక్ సభ తెలంగాణ అభ్యర్ధులు కూడా శుక్రవారం నాడు నామినేషన్లు వేయనున్నారు.

First Published:  21 March 2019 10:40 PM GMT
Next Story