Telugu Global
Cinema & Entertainment

పంచాయితీ వార్డు మెంబర్‌గా నటించనున్న రానా

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని రకాల పాత్రలు చేయగల నటుల్లో ప్రప్రథమంగా వినిపించే పేరు రానా దగ్గుబాటి. ఇటు తెలుగు, తమిళ్ భాషలతో పాటు అటు హిందీలో కూడా వరుస సినిమాలతో రానా బిజీగా ఉన్నాడు. రాజకీయ నాయకుడి పాత్రలో ఎంత మంది నటులు మెరిసినా రానా మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సినిమా ‘లీడర్‌’లోనే ముఖ్యమంత్రి పాత్ర పోషించి అలరించిన రానా చాలా కాలం తర్వాత ‘నేనే రాజు […]

పంచాయితీ వార్డు మెంబర్‌గా నటించనున్న రానా
X

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని రకాల పాత్రలు చేయగల నటుల్లో ప్రప్రథమంగా వినిపించే పేరు రానా దగ్గుబాటి. ఇటు తెలుగు, తమిళ్ భాషలతో పాటు అటు హిందీలో కూడా వరుస సినిమాలతో రానా బిజీగా ఉన్నాడు.

రాజకీయ నాయకుడి పాత్రలో ఎంత మంది నటులు మెరిసినా రానా మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సినిమా ‘లీడర్‌’లోనే ముఖ్యమంత్రి పాత్ర పోషించి అలరించిన రానా చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో మళ్ళీ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి ప్రేక్షకులని అలరించాడు.

ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడి పాత్రని సైతం పోషించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా రానా ఇప్పుడు మరోసారి రాజకీయ నాయకుడి పాత్రలో మెరవనున్నారు.

తన తదుపరి చిత్రంలో రానా ఒక పంచాయితీ వార్డ్ మెంబర్‌గా కనిపించబోతున్నాడు. ‘విరాటపర్వం 1992’ అనే ఈ చిత్రానికి ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేం వేణు ఊడుగుల దర్శకుడు. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

First Published:  22 March 2019 4:12 AM GMT
Next Story