Telugu Global
Cinema & Entertainment

మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న సీనియర్ బ్యూటీ

‘నా పేరు సూర్య…. నా ఇల్లు ఇండియా’ అనే దేశభక్తి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమాతో హిట్ అందుకోలేక పోయాడు. తాజాగా బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా […]

మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న సీనియర్ బ్యూటీ
X

‘నా పేరు సూర్య…. నా ఇల్లు ఇండియా’ అనే దేశభక్తి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమాతో హిట్ అందుకోలేక పోయాడు.

తాజాగా బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం నుండి మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ విషయమై చాలా పేర్లు బయటకు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ మధ్యకాలంలో కుష్బూ, నదియా లాంటి సీనియర్ హీరోయిన్ల ను ముఖ్య పాత్రల ద్వారా మళ్ళీ తెరపైకి తీసుకువచ్చిన త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా ఒక సీనియర్ హీరోయిన్ ని మళ్ళీ తెలుగు తెరపైకి తీసుకువస్తున్నారు.

ఆమె ఎవరో కాదు టబు అని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్ర కోసం తనను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఆమె కూడా దాదాపుగా ఓకే చెప్పేసింది అని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో బిజీగా ఉన్న టబు తెలుగు సినిమాల్లో కనిపించి చాలా ఏళ్లయింది. ఈ సినిమాలో సత్యరాజ్, జయరాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

First Published:  22 March 2019 8:12 AM GMT
Next Story