Telugu Global
NEWS

టీడీపీ యాడ్స్‌లో హింస, ఈసీపై ఆశలు వదులుకోవాల్సిందేనా....

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు చంపుతామని ఓటర్లను బెదిరిస్తున్నా…. యదేచ్చగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నా… చంద్రబాబు ఇప్పటికీ అధికార యంత్రాంగాన్ని మొత్తం వాడుకుంటున్నా అడిగే వారే లేకుండా పోయారు. కోడ్ అమలులోకి వచ్చినా ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో చంద్రబాబుకు వదిలేసినట్టుగా అనిపిస్తోంది. తీవ్ర ఆరోపణలు వస్తున్నా సరే పోలీసు అధికారులను మార్చే విషయంలో మౌనంగానే ఉంటోంది. చివరకు టీడీపీ ఇస్తున్న ప్రకటనలు హద్దులు దాటిపోయాయి. కానీ చర్యలు లేవు. పచ్చి అబ్దదాలతో యాడ్స్‌ను టీవీ చానళ్లలో ప్రసారం […]

టీడీపీ యాడ్స్‌లో హింస, ఈసీపై ఆశలు వదులుకోవాల్సిందేనా....
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు చంపుతామని ఓటర్లను బెదిరిస్తున్నా…. యదేచ్చగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నా… చంద్రబాబు ఇప్పటికీ అధికార యంత్రాంగాన్ని మొత్తం వాడుకుంటున్నా అడిగే వారే లేకుండా పోయారు. కోడ్ అమలులోకి వచ్చినా ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో చంద్రబాబుకు వదిలేసినట్టుగా అనిపిస్తోంది.

తీవ్ర ఆరోపణలు వస్తున్నా సరే పోలీసు అధికారులను మార్చే విషయంలో మౌనంగానే ఉంటోంది. చివరకు టీడీపీ ఇస్తున్న ప్రకటనలు హద్దులు దాటిపోయాయి. కానీ చర్యలు లేవు. పచ్చి అబ్దదాలతో యాడ్స్‌ను టీవీ చానళ్లలో ప్రసారం
చేస్తున్నా ఈసీ స్పందించడం లేదు.

అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చింది వెయ్యి మాత్రమే. కానీ ఏకంగా 15వేలు ఇచ్చినట్టు టీవీల్లో యాడ్స్
ప్లేచేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే… టీడీపీ ఇస్తున్న యాడ్స్‌లో హింస కూడా ఉంటోంది.

ఈసీ అధికారులు ప్రకటనలను చూసిన తర్వాతే వాటి ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ టీడీపీ యాడ్స్‌లో మనుషులను కొట్టడం కూడా ఉంది. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలు, గ్రాఫిక్స్ అని ఒక యువకుడు తన అభిప్రాయాన్ని చెప్పగా… టీడీపీ అభిమాని ఏకంగా అతడిని కొట్టడం కూడా టీడీపీ ఇస్తున్న యాడ్స్‌లో ఉంది.

ఇలా హింసను, మనుషుల మధ్య ధ్వేషాన్ని పెంచే ప్రకటనలను ప్రసారం చేసేందుకు ఎన్నికల అధికారులు ఎలా అనుమతి ఇచ్చారన్నది అంతుపట్టడం లేదు. ఏపీలో ఎన్నికల సంఘం అధికారుల తీరు చూసి మేధావులు ఆశ్చర్యపోతున్నారు.

గ్రాఫిక్స్ కాదు నిజం

పాదాలను చల్లగా తాకుతున్న నీళ్ళు గ్రాఫిక్స్ కాదు. అపర భగీరథుడు చంద్రబాబు నదుల అనుసంధాన ఫలం #BabuAnteneNammakam#BabuThoneBharosa#MeeBhavishyattuNaaBadhyata#TDPMission150#VoteForCycle

Posted by Telugu Desam Party (TDP) on Thursday, 21 March 2019

First Published:  21 March 2019 11:16 PM GMT
Next Story