Telugu Global
NEWS

గోరంట్ల మాధవ్‌ భార్యకు టిక్కెట్

హిందూపురం లోక్‌సభ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ రాజీనామాను ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. హైకోర్టును ఆశ్రయించారు. గోరంట్ల మాధవ్‌పై రెండు చార్జ్‌ మెమోలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని క్లియర్ చేయకుండా రాజీనామా ఆమోదించడం వీలు కాదని పోలీస్ శాఖ వాదిస్తోంది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కూడా అదే. ఒకవేళ కోర్టు నుంచి మాధవ్‌కు అనుకూలంగా తీర్పు రాకపోతే ఆయన భార్యను వైసీపీ బరిలో దించనుంది. మాధవ్‌ భార్య సవితకు బీఫాం ఇవ్వనుంది […]

గోరంట్ల మాధవ్‌ భార్యకు టిక్కెట్
X

హిందూపురం లోక్‌సభ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ రాజీనామాను ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. హైకోర్టును ఆశ్రయించారు. గోరంట్ల మాధవ్‌పై రెండు చార్జ్‌ మెమోలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని క్లియర్ చేయకుండా రాజీనామా ఆమోదించడం వీలు కాదని పోలీస్ శాఖ వాదిస్తోంది.

హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కూడా అదే. ఒకవేళ కోర్టు నుంచి మాధవ్‌కు అనుకూలంగా తీర్పు రాకపోతే ఆయన భార్యను వైసీపీ బరిలో దించనుంది.

మాధవ్‌ భార్య సవితకు బీఫాం ఇవ్వనుంది వైసీపీ. శనివారం జగన్‌ను గోరంట్ల మాధవ్‌ కలిసి ఈ విషయంపై చర్చించారు. రాజీనామా ఆమోదం పొందని పక్షంలో మాధవ్‌ భార్యకు బీఫాం ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించారు.

వెంటనే రాజీనామా ఆమోదించాలని హైకోర్టు ఆదేశించినా… సోమవారం నామినేషన్ గడుపు సమయం ముగిసే వరకు ప్రభుత్వం కాలయాపన చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ భార్యకే బీఫాం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

First Published:  23 March 2019 2:11 AM GMT
Next Story