Telugu Global
National

తీవ్ర సంక్షోభంలో జెట్ ఎయిర్‌ వేస్.... అంతర్జాతీయ విమానాలు రద్దు

ఒకప్పుడు దేశీయ విమాన రంగానికి దిక్సూచీలా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. ఇటీవల కాలంలో పైలెట్లు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించక పోవడంతో వాళ్లు సమ్మెకు దిగారు. దాంతో ఎన్నో విమాన సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా విమానాల అద్దె చెల్లించక పోవడంతో పలు సంస్థలు జెట్ ఎయిర్‌వేస్‌కు తమ విమానాలను ఇవ్వడం మానేశాయి. దీంతో పలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. […]

తీవ్ర సంక్షోభంలో జెట్ ఎయిర్‌ వేస్.... అంతర్జాతీయ విమానాలు రద్దు
X

ఒకప్పుడు దేశీయ విమాన రంగానికి దిక్సూచీలా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. ఇటీవల కాలంలో పైలెట్లు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించక పోవడంతో వాళ్లు సమ్మెకు దిగారు. దాంతో ఎన్నో విమాన సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఇక తాజాగా విమానాల అద్దె చెల్లించక పోవడంతో పలు సంస్థలు జెట్ ఎయిర్‌వేస్‌కు తమ విమానాలను ఇవ్వడం మానేశాయి. దీంతో పలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు 13 అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేశారు. వీటిలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లేవే ఉన్నాయి.

అలాగే బెంగళూరు నుంచి ప్రతీ రోజు రెండు సార్లు సింగపూర్ నడిపే సర్వీసును కూడా జెట్ ఎయిర్‌వేస్ విరమించుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రయాణికులకు తెలియజేశారు. తమ విమాన లీజుదారులతో ఇప్పటికీ చర్చలు జరుపుతున్నామని.. సాధ్యమైనంత త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి తిరిగి సర్వీసులు యధావిధిగా నడిపేలా ప్రయత్నిస్తామని జెట్ ఎయిర్‌వేస్ ప్రతినిధి తెలిపారు.

First Published:  23 March 2019 12:44 AM GMT
Next Story