Telugu Global
Cinema & Entertainment

ఫొటో కాజల్ ... పేరు దీపికా...

ప్ర‌తీసారి ఓటర్ల జాబితా విడుద‌లైన‌పుడు కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరగడం సహజం. అందులో కొన్ని చాలా కామెడీగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి సిల్లీ త‌ప్పు జ‌రిగింది. రాజమండ్రిలో ఎన్నిక‌ల క‌మీష‌న్ విడుదల చేసిన ఓటర్ లిస్టులో జరిగిన తప్పిదం వల్ల దీపికా, కాజల్ బలయ్యారు. రాజమండ్రి రూరల్ ఓటర్ల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ ఫొటో పెట్టి, ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు పెట్టారు. అది చూసి అందరూ […]

ఫొటో కాజల్ ... పేరు దీపికా...
X

ప్ర‌తీసారి ఓటర్ల జాబితా విడుద‌లైన‌పుడు కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరగడం సహజం. అందులో కొన్ని చాలా కామెడీగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి సిల్లీ త‌ప్పు జ‌రిగింది. రాజమండ్రిలో ఎన్నిక‌ల క‌మీష‌న్ విడుదల చేసిన ఓటర్ లిస్టులో జరిగిన తప్పిదం వల్ల దీపికా, కాజల్ బలయ్యారు.

రాజమండ్రి రూరల్ ఓటర్ల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ ఫొటో పెట్టి, ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు పెట్టారు. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

‘మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్’ సినిమాలోని కాజ‌ల్ ఫొటో ను ఓట‌ర్ల జాబితాలో చేర్చారు. ఫొటో పక్కన పేరులో దీపికా పదుకొనే అని రాశారు. ఇదేమి విచిత్రం అని కొందరు ముక్కన వేలేసుకుంటుంటే, కొంపదీసి కాజల్ అగర్వాల్ దీపికా గా పేరు మార్చుకుందా ఏంటి అని చమత్కరిస్తున్నారు మరికొందరు.

అంతే కాక ఆమె తండ్రి పేరు ర‌మేష్ కొండా అని, వ‌య‌సు 22 అని, ఇంటి నెంబర్ 3-5-22 అని కూడా ప్రింట్ చేసేశారు. ఇప్పుడు ఆ ఓట‌ర్ జాబితా చూసిన అందరూ నోరెళ్ళబెడుతున్నారు.

ఇది చూసిన తరువాత ఎన్నిక‌ల క‌మీష‌న్ ప‌నితీరుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎప్ప‌ట్నుంచో ఇలాంటి త‌ప్పులు జరగకుండా చూసుకుంటామ‌ని వారు చెబుతూనే ఉన్నప్పటికీ ఇలాంటి తప్పిదాలు మాత్రం దొర్లుతూనే ఉన్నాయి.

First Published:  23 March 2019 1:24 AM GMT
Next Story