Telugu Global
Cinema & Entertainment

రొమాంటిక్ డ్రామా vs హారర్

2013 లో మారుతి దర్శకత్వ పర్వవేక్షణ లో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ కథా చిత్రం’. ఈ సినిమా కి ఈ సంవత్సరం సీక్వెల్ రానున్నది. అయితే ఈ సారి రెండో భాగం లో మొదటి భాగానికి పని చేసిన వారు ఎవరూ పని చేయడం లేదు. సుమంత్ అశ్విన్ ఈ రెండో భాగం లో హీరో గా నటించగా, నటుడు కృష్ణ తేజ హీరో ఫ్రెండ్ గా చేసాడు. మొదటి చిత్రాన్ని […]

రొమాంటిక్ డ్రామా vs  హారర్
X

2013 లో మారుతి దర్శకత్వ పర్వవేక్షణ లో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ కథా చిత్రం’. ఈ సినిమా కి ఈ సంవత్సరం సీక్వెల్ రానున్నది. అయితే ఈ సారి రెండో భాగం లో మొదటి భాగానికి పని చేసిన వారు ఎవరూ పని చేయడం లేదు.

సుమంత్ అశ్విన్ ఈ రెండో భాగం లో హీరో గా నటించగా, నటుడు కృష్ణ తేజ హీరో ఫ్రెండ్ గా చేసాడు. మొదటి చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థే ఈ రెండో భాగానికి కూడా పని చేస్తుండడం విశేషం.

అయితే సుమంత్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా ని విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమాని ఏప్రిల్ కి జరపాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ఉగాది పండుగని పురస్కరించుకొని ఈ సినిమా ని ఏప్రిల్ 6 న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అదే రోజున నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ కూడా విడుదల కానుండడం తో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు రొమాంటిక్ డ్రామా, మరో వైపు హారర్ సినిమా. ఈ రెండిటి మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  23 March 2019 4:33 AM GMT
Next Story