Telugu Global
Cinema & Entertainment

మెగా కాంపౌండ్ దాటి నందమూరి కాంపౌండ్ చేరిన సినిమా

‘నా నువ్వే’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే సినిమాటోగ్రఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ‘118’ సినిమాలో నటించాడు కళ్యాణ్ రామ్. శాలిని పాండే, నివేదాథామస్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్ళనే రాబట్టింది. ఇక ఈ చిత్రం సక్సెస్ తో కళ్యాణ్ రాం ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. […]

మెగా కాంపౌండ్ దాటి నందమూరి కాంపౌండ్ చేరిన సినిమా
X

‘నా నువ్వే’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మధ్యనే సినిమాటోగ్రఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ‘118’ సినిమాలో నటించాడు కళ్యాణ్ రామ్. శాలిని పాండే, నివేదాథామస్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్ళనే రాబట్టింది.

ఇక ఈ చిత్రం సక్సెస్ తో కళ్యాణ్ రాం ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముందెప్పుడూ చేయని విధంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక సోషియో ఫాంటసీ సినిమా లో కనిపించనున్నాడు.

ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది. కొత్త దర్శకుడు మల్లిది వేణు ఈ సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సోషియో ఫాంటసీ చిత్రం కావడం వలన ఈ సినిమాకు భారీ బడ్జెట్ వినియోగిస్తున్నట్లు సమాచారం. అందుకే కళ్యాణ్ రామ్ స్వయంగా రిస్క్ తీసుకుని తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నిజానికి దర్శకుడు వేణు ఈ చిత్రంలో అల్లు శిరీష్ ని హీరోగా తీసుకుందామనుకున్నాడట. కారణం ఏంటో తెలియదు గానీ మెగా కాంపౌండ్ నుండి నందమూరి కాంపౌండ్ లోకి చేరిన ఈ స్క్రిప్టు ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో పడింది. ఈ సినిమాకు ‘తుగ్లక్’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

First Published:  23 March 2019 12:08 AM GMT
Next Story