Telugu Global
NEWS

పవన్ సారూ... అధికారంలో ఉన్నది బాబా...! జగనా..! : జన సైనికుల ప్రశ్న

జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆయన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడా..? లేక వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డా? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన జనసేన ఎన్నికల బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై తమకు ఈ అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికలలో ప్రధాన వైరిపక్షాన్ని కూడా విమర్శించడం తప్పు కాకపోయినా… ఐదు ఏళ్లు […]

పవన్ సారూ... అధికారంలో ఉన్నది బాబా...! జగనా..! : జన సైనికుల ప్రశ్న
X

జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆయన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడా..? లేక వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డా? అని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన జనసేన ఎన్నికల బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై తమకు ఈ అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికలలో ప్రధాన వైరిపక్షాన్ని కూడా విమర్శించడం తప్పు కాకపోయినా… ఐదు ఏళ్లు అధికారంలో ఉండి అవినీతితో రాజ్యమేలిన చంద్రబాబు నాయుడుని వదిలేసి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై విరుచుకుపడడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

“పవన్ సార్… మీ వైఖరి… బహిరంగ సభలో మీ ప్రసంగాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటున్నాయి. మీ ధోరణి మార్చుకుంటే మంచిది” అని జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు చేస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఎలా పని చేశామో… అంతకు మూడింతలు ఎక్కువగా పని చేస్తున్నామని జన సైనికులు పవన్ కళ్యాణ్ కి స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. గతంలో కూడా చిరంజీవి పార్టీ కార్యకర్తలను నిలువునా ముంచి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని, ఇప్పుడు మీ వైఖరి చూస్తుంటే మీరు కూడా తెలుగుదేశంలో కలిపేస్తారనే అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు.

తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అవినీతి తారాస్థాయిలో ఉందని, జనసేన బహిరంగ సభల్లో ఆ విషయాలు ప్రస్తావించకుండా… ఎలాంటి రుజువులు లేని జగన్ అవినీతి అంటూ విరుచుకుపడడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రభావమేనా? అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి టిక్కెట్లు ఇస్తామంటూ అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తే…. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం అందరికీ టిక్కెట్లు ఇచ్చేసి హోల్ సేల్ గా చంద్రబాబు నాయుడుకి పార్టీనీ, అభ్యర్ధులను అమ్మేస్తున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  22 March 2019 11:57 PM GMT
Next Story