Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ హీరో తో చిందులేయనున్న పాయల్ రాజ్ పుత్

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాల్లో తన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పాయల్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాక ఈమె ‘సీత’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతోంది. వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా లో పాయల్ రాజ్ పుత్ […]

ఫ్లాప్ హీరో తో చిందులేయనున్న పాయల్ రాజ్ పుత్
X

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాల్లో తన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పాయల్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.

అంతేకాక ఈమె ‘సీత’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతోంది. వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా లో పాయల్ రాజ్ పుత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి డాన్స్ చేయనుంది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ పాయల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తేజ, పాయల్ రాజ్ పుత్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

“తెలుగులో టాలెంట్ ఉన్న హీరోయిన్లలో పాయల్ కూడా ఒకరు. రిహార్సల్స్ కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడం మాత్రమే కాక కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంది. పాయల్ చాలా ప్రొఫెషనల్” అని అన్న తేజ ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఫోకస్ కచ్చితంగా పాయల్ మీద మాత్రమే ఉంటుందని అన్నాడు తేజ.

ఒకవేళ తేజ అన్నట్లు పాయల్ ఈ పాట ద్వారా ఆకట్టుకుంటే ఆమెకు కచ్చితంగా చాలా సినిమా ఆఫర్లు వస్తాయని చెప్పొచ్చు.

First Published:  22 March 2019 11:09 PM GMT
Next Story