Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వాయిదా పడిన మెగా హీరో సినిమా

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో హిట్ అందుకున్న అల్లు శిరీష్ మళ్లీ ‘ఒక్క క్షణం’ సినిమాతో పెద్ద డిజాస్టర్ ను చవి చూశాడు. ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘ఏబిసిడి’ పైనే శిరీష్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ‘అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా కు తెలుగు రీమేక్.  సంజీవ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ ఈ […]

మళ్లీ వాయిదా పడిన మెగా హీరో సినిమా
X

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో హిట్ అందుకున్న అల్లు శిరీష్ మళ్లీ ‘ఒక్క క్షణం’ సినిమాతో పెద్ద డిజాస్టర్ ను చవి చూశాడు.

ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘ఏబిసిడి’ పైనే శిరీష్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ‘అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా కు తెలుగు రీమేక్. సంజీవ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే బోలెడు సార్లు వాయిదా మెగా అభిమానులను నిరాశకు గురిచేసింది. మార్చి 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ తరువాత విడుదల తేదీ ని 21 కి మార్చారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఆ తేదీ కూడా కాదని సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మే తరువాత మాత్రమే విడుదల అవుతుంది అని కొందరు చెబుతున్నారు.

అయితే విడుదల తేదీ పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు అల్లు శిరీష్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జుధా సాంధీ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

First Published:  24 March 2019 12:45 AM GMT
Next Story