Telugu Global
NEWS

బొత్స వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రలో కలకలం!

“కళావెంకట్రావు గారు… ఆస్తుల కోసం మీరు అన్నదమ్ముల్ని హత్య చేయించలేదా!?” “పార్టీలోనూ…. మీ ఎదుగుదలకు అడ్డు వస్తున్నారని ఎంత మందిని అణచివేశారో మీకు గుర్తు లేదా” “నేనిప్పుడు నిజాలు చెబితే మీ పునాదులు కదులుతాయి” ఈ మాటలు అన్నది… ఈ హెచ్చరికలు చేసింది మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు నుద్దేశించి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు […]

బొత్స వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రలో కలకలం!
X

“కళావెంకట్రావు గారు… ఆస్తుల కోసం మీరు అన్నదమ్ముల్ని హత్య చేయించలేదా!?”

“పార్టీలోనూ…. మీ ఎదుగుదలకు అడ్డు వస్తున్నారని ఎంత మందిని అణచివేశారో మీకు గుర్తు లేదా”

“నేనిప్పుడు నిజాలు చెబితే మీ పునాదులు కదులుతాయి”

ఈ మాటలు అన్నది… ఈ హెచ్చరికలు చేసింది మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు నుద్దేశించి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను మంత్రిగా ఉన్నప్పు డు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆవేశమో… వాస్తవమో… తెలియదు కానీ కళా వెంకట్రావు అన్నదమ్ముల్ని హత్య చేయించారని ఓ భారీ విమర్శ చేశారు బొత్స. ఈ విమర్శ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో, తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్షాలను, ఉత్తరాంధ్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరో విధంగా చెప్పాలంటే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో సంచలనం రేపుతున్నాయి.

నుదుటన కుంకుమ బొట్టుతో, నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ ఉండే కిమిడి కళా వెంకట్రావు ఆస్తుల కోసం అన్నదమ్ములను హత్య చేయించారనే వ్యాఖ్య ఆయన సొంత జిల్లాతోపాటు పక్కనే ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా దావానంలా వ్యాపించింది.

సాధారణంగా వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వని బొత్స సత్యనారాయణ ఆస్తి కోసం అన్నదమ్ములను చంపారంటూ కళా వెంకట్రావు పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఆరోపణలు, విమర్శలు చేసి ఊరుకోవడమే కాకుండా… తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తానని కూడా బొత్స సత్యనారాయణ చాలెంజ్ చేశారు.

దీంతో కిమిడి కళా వెంకట్రావుపై స్వపక్షంలో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. పైకి అమాయకంగా కనిపించే కళా వెంకట్రావులో అన్నదమ్ములను సైతం హత్య చేయించే నైజముందా అని ప్రశ్నలు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణ ఈ ఒక్క విమర్శతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంచలనం సృష్టించారని ఆ జిల్లాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  23 March 2019 9:45 PM GMT
Next Story