పసుపు- కుంకుమ అంతా మోసం – మైక్‌ ఆపేసి పంపిన చంద్రబాబు

చంద్రబాబునాయుడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు షాక్ ఇచ్చారు. రాయచోటిలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు సమక్షంలోనే పసుపు- కుంకుమ కార్యక్రమం అంతా మోసం అని వ్యాఖ్యానించారు.

దాంతో చంద్రబాబు షాక్‌ అయ్యారు. పాలకొండ్రాయుడిని వారించే ప్రయత్నం చేసినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పసుపు- కుంకుమ వల్ల ఎవరికీ లాభం జరగలేదని స్పష్టంగా చెప్పారు.

ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వలేదని… డబ్బంత కాజేశారని ఆరోపించారు. దాంతో చంద్రబాబు కనుసైగ చేశారు. వెంటనే వచ్చిన టీడీపీ నేతలు మైక్ ఆపేసి పాలకొండ్రాయుడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.