Telugu Global
Cinema & Entertainment

రూటు మార్చిన గోపీచంద్.... హిట్ ఇచ్చేనా?

గత కొంతకాలంగా గోపీచంద్ ఒక్క హిట్ అందుకోవడం కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ…. ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకోలేక పోయింది. వరుసగా డిజాస్టర్లు అందుకున్న గోపీచంద్ చివరికి తన తప్పు తెలుసుకుని తన తదుపరి సినిమా నుంచి ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ తదుపరి సినిమాకు గౌతమ్ నంద ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందులాగా యాక్షన్ ఎంటర్ టైనర్లు కాకుండా గోపీచంద్ […]

రూటు మార్చిన గోపీచంద్.... హిట్ ఇచ్చేనా?
X

గత కొంతకాలంగా గోపీచంద్ ఒక్క హిట్ అందుకోవడం కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ…. ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకోలేక పోయింది.

వరుసగా డిజాస్టర్లు అందుకున్న గోపీచంద్ చివరికి తన తప్పు తెలుసుకుని తన తదుపరి సినిమా నుంచి ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం గోపీచంద్ తదుపరి సినిమాకు గౌతమ్ నంద ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందులాగా యాక్షన్ ఎంటర్ టైనర్లు కాకుండా గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమా ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందట.

దాదాపు దశాబ్ద కాలం తర్వాత గోపీచంద్ ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో చిత్ర దర్శకుడు బిజీగా ఉన్నారు.

స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగానే ఈ సినిమా షూటింగ్ రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి రూటు మార్చిన గోపీచంద్ ఈసారైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

First Published:  24 March 2019 2:11 AM GMT
Next Story