Telugu Global
Cinema & Entertainment

ఒకవైపు ఎలక్షన్స్‌ మరోవైపు ఐపీఎల్‌.... సమ్మర్ లో సినిమాల పరిస్థితి ఏంటో?

ప్రస్తుతం థియేటర్లలో ఒక్క మంచి తెలుగు సినిమా కూడా ఆడటం లేదు అంటే అతిశయోక్తి కాదు. దాదాపు అన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సినిమా చూసే వారు లేక థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. దానికి కారణం ఈ మధ్య కాలంలో ఒక మంచి తెలుగు సినిమా కూడా రాకపోవడం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో థియేటర్స్ యాజమాన్యానికి ఏప్రిల్ లో కొంత ఊరట లభించనుంది. ఏప్రిల్ నుండి కనీసం వారానికి ఒక సినిమా విడుదల కానుంది…. కానీ అవి […]

ఒకవైపు ఎలక్షన్స్‌ మరోవైపు ఐపీఎల్‌.... సమ్మర్ లో సినిమాల పరిస్థితి ఏంటో?
X

ప్రస్తుతం థియేటర్లలో ఒక్క మంచి తెలుగు సినిమా కూడా ఆడటం లేదు అంటే అతిశయోక్తి కాదు. దాదాపు అన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సినిమా చూసే వారు లేక థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. దానికి కారణం ఈ మధ్య కాలంలో ఒక మంచి తెలుగు సినిమా కూడా రాకపోవడం అని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో థియేటర్స్ యాజమాన్యానికి ఏప్రిల్ లో కొంత ఊరట లభించనుంది. ఏప్రిల్ నుండి కనీసం వారానికి ఒక సినిమా విడుదల కానుంది…. కానీ అవి ఎంత వరకు ఆడతాయి అనే విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద చర్చజరుగుతుంది.

ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. దాదాపు అందరూ ఎన్నికల పైనే దృష్టి పెడుతున్నారు. సినిమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇది చాలదన్నట్టు ఐపీఎల్ సీజన్ మొదలైంది.

ఏకంగా రెండు నెలలపాటు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసే సీజన్ ఇది. దానివల్ల సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆ సినిమా చూస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఏప్రిల్ లో మొదటగా విడుదల కానున్న సినిమా ‘మజిలీ’. నాగచైతన్య కెరీర్ కు ఈ సినిమా చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. ఒకవైపు ఎన్నికలు మరొకవైపు ఐపీఎల్ రెండిటిని తట్టుకుని…. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచి చూడాలి.

First Published:  23 March 2019 11:57 PM GMT
Next Story