ఐపీఎల్ బోర్డు సంచలన నిర్ణయం

  • ప్రారంభవేడుకల నిధులు సైనికదళాలకు
  • మొత్తం 20 కోట్లను రక్షణ దళాలకు ఇవ్వాలని నిర్ణయం

భారత క్రికెట్ వేసవి వినోదం ఐపీఎల్ చరిత్రలో సరికొత్త చరిత్రకు..ప్రస్తుత 12వ సీజన్లో తెరలేచింది. ఐపీఎల్ ప్రారంభవేడుకలను భారీబడ్జెట్ తో అట్టహాసంగా నిర్వహించడం గత 11 సీజన్లుగా ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుత 12వ సీజన్లో సైతం ప్రారంభవేడుకల కోసం 20 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రత్యేకంగా కేటాయించారు. అయితే …ఈ మొత్తాన్ని…పుల్వామా అమరుల సంక్షేమం కోసం… రక్షణ దళాలకు… ఇవ్వాలని ఐపీఎల్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది.