ఆంధ్రాలో ఒక్క ఓటు లేని కేసీఆర్‌కు ఇక్కడేం పని : లోకేష్ బాబు

ఏపీలో ఒక్క ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి పడదని.. అసలు వారికి ఇక్కడ కార్యకర్తే లేడని.. అలాంటి సమయంలో తెలంగాణ సీఎ కేసీఆర్ ఇక్కడ ఎందుకు రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని రేవేంద్రపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

టీడీపీ తిరిగి అధికారంలోనికి వచ్చిన వెంటనే మంగళగిరి నియోజకర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పక్క రాష్ట్ర సీఎం ఇక్కడ అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని.. అలాంటి వాటిని తెలుగు ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీనే తిరిగి ఏపీలో అధికారంలోని వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సందర్భంగా దుగ్గిరాల పసుపు యార్డ్ చైర్మన్ కేశినేని శ్రీధర్ ఆయనకు పసుపు కొమ్ములతో సత్కారం చేశారు.