మరోసారి వాయిదాపడిన నిఖిల్ సినిమా

అదేంటో… ఏ ముహూర్తాన నిఖిల్ ఈ సినిమా స్టార్ట్ చేశాడో కానీ ఇది రిలీజ్ అవ్వడానికి చాలా కష్టాలు పడుతోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పూర్తికాకపోవడంతో మూవీని వాయిదావేశారు.

ఆ తర్వాత మరోసారి విడుదల చేయాలని ట్రైచేశారు. ఈసారి నట్టికుమార్ అడ్డుకున్నారు. తన సినిమాకు కూడా ముద్ర అనే టైటిల్ పెట్టామంటూ రచ్చకెక్కారు. దీంతో సినిమాకు అర్జున్ సురవరం అనే టైటిల్ ఫిక్స్ చేసి మరోసారి వాయిదావేశారు. ఇక అంతా పూర్తయిందని భావించి ఈనెల 29న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇది ఫైనల్ అనుకున్నారంతా. కానీ ఈసారి కూడా సినిమా వాయిదాపడింది.

అవును.. అర్జున్ సురవరం సినిమా మరోసారి వాయిదాపడింది. ఈనెల 29న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఏకంగా మే 1కి వాయిదావేశారు. అంటే అచ్చంగా నెల రోజులు వాయిదా వేశారట. ఈసారి మాత్రం వాయిదాకు కారణాలు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఎడిటింగ్ లో కొన్ని కీలక మార్పులతో పాటు గ్రాఫిక్స్ వర్క్ కోసం సినిమాను వాయిదావేశారు.

తమిళ్ లో హిట్ అయిన కనిథన్ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అర్జున్ సురవరం అనే జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. సంతోష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.