Telugu Global
Cinema & Entertainment

హక్కులకై పోరాడనున్న టబు

రానా దగ్గుబాటి ప్రస్తుతం అనేక చిత్రాల తో బిజీ గా ఉన్నాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా రాణిస్తున్న రానా త్వరలో ఒక పీరియడ్ చిత్రం లో నటించనున్నాడు. ”నీది నాది ఒకే కథ” అనే సందేశాత్మక చిత్రాన్ని తీసిన దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. రానా తో పాటు ఈ చిత్రం లో సాయి పల్లవి నటించనున్నది. ”విరాట పర్వం 1992” అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం లో […]

హక్కులకై పోరాడనున్న టబు
X

రానా దగ్గుబాటి ప్రస్తుతం అనేక చిత్రాల తో బిజీ గా ఉన్నాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా రాణిస్తున్న రానా త్వరలో ఒక పీరియడ్ చిత్రం లో నటించనున్నాడు.

”నీది నాది ఒకే కథ” అనే సందేశాత్మక చిత్రాన్ని తీసిన దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. రానా తో పాటు ఈ చిత్రం లో సాయి పల్లవి నటించనున్నది. ”విరాట పర్వం 1992” అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం లో రానా, పల్లవి పాత్రలు హైలైట్ గా నిలవనున్నాయని వినికిడి.

అయితే ఈ చిత్రంలో రానా పంచాయితీ రాజ్ వార్డ్ మెంబర్ గా నటిస్తున్నాడు అనే విషయం ఒయటకి వచ్చినప్పటికీ…. ఈ చిత్రం లో ఇంకో ముఖ్య పాత్ర గురించి ఒక కీలకమైన సమాచారం బయటకు వచ్చింది.

ఈ చిత్రం లో టబు ఒక ప్రముఖ పాత్ర పోషించనున్నది అని సమాచారం. ఈ చిత్రం లో మానవ హక్కుల కోసం పోరాడే ఒక కార్యకర్త గా టబు మెరవనుంది. టబు పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది అని, ఆవిడ పాత్ర చాలా మందిని కదిలిస్తదని తెలుస్తోంది. ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ మరి కొద్ది రోజుల్లో మొదలు కానుంది.

First Published:  23 March 2019 11:28 PM GMT
Next Story