Telugu Global
NEWS

పవన్‌... నేను కాపునే... నేను నోరు విప్పితే నవరంధ్రాలు మూసుకుంటావ్‌....

తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచార సభల్లో పవన్‌ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్నికృష్ణ ఫైర్ అయ్యారు. మెగా ఫ్యామిలీ సభ్యుడి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు. కేసీఆర్‌ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దు అని పవన్‌ కల్యాణ్ అంటున్నారని… కేసీఆర్‌ ఏమైనా పవన్ కల్యాణ్‌కు గిఫ్ట్ ఇస్తానని అన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు కంగారు పడుతున్నారని నిలదీశారు. తెలంగాణలో తామంతా కలిసిమెలిసి బతుకుతుంటే పవన్‌ కల్యాణ్ […]

పవన్‌... నేను కాపునే... నేను నోరు విప్పితే నవరంధ్రాలు మూసుకుంటావ్‌....
X

తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచార సభల్లో పవన్‌ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్నికృష్ణ ఫైర్ అయ్యారు. మెగా ఫ్యామిలీ సభ్యుడి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు. కేసీఆర్‌ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దు అని పవన్‌ కల్యాణ్ అంటున్నారని… కేసీఆర్‌ ఏమైనా పవన్ కల్యాణ్‌కు గిఫ్ట్ ఇస్తానని అన్నారా?
అని ప్రశ్నించారు. చంద్రబాబు గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు కంగారు పడుతున్నారని నిలదీశారు.

తెలంగాణలో తామంతా కలిసిమెలిసి బతుకుతుంటే పవన్‌ కల్యాణ్ మాత్రం రెచ్చగొట్టేలా, విధ్వేషాలు రగిల్చేలా ఎందుకు మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాటల కారణంగా తమకు ఏదైనా ఇబ్బంది వస్తే నాగబాబు వచ్చి కాపాడుతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలను ప్రమాదంలోకి నెట్టేలా పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దన్నారు.

తాను నోరు తెరిస్తే పవన్‌ కల్యాణ్‌ నవరంద్రాలు మూసుకోవాల్సి ఉంటుందన్నారు. రంగాను విజయవాడ గడ్డ మీద ముక్కలు ముక్కలుగా నరికారని…. అలాంటి నేలపై నిలబడి పవన్‌ కల్యాణ్ మాట్లాడే మాటలు ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఏమిటని ప్రశ్నించారు.

మే 23న టీవీల ముందు కూర్చుంటే పవన్‌ కల్యాణ్ లాంటి వారికి గుండెలు పగిలిపోయేలా ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. తాను కాపునేనని… తన పేరు ఆకుల చిన్ని కృష్ణ అని చెప్పారు. పవన్‌ కల్యాణ్ సినిమాల్లో 75 శాతం టికెట్లు కొనేది కాపులేనని… అలా వారి ద్వారా ఎదిగి వారికి ఇప్పటి వరకు ఏసాయమైనా చేశారా? అని నిలదీశారు.

మెగా కుటుంబం మీద అభిమానంతో ఇంద్ర, గంగోత్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథ అందించానని… అలాంటి తనకే ఒక్కరోజు కూడా మెగా కుటుంబం ఆకేసి అన్నం పెట్టలేదన్నారు. అలాంటి పవన్‌ కల్యాణ్‌ కోసం కాపులు జీవితాలు
నాశనం చేసుకోవద్దని ఒక కాపు సోదరుడిగా తాను సూచిస్తున్నానని అన్నారు.

ఐదేళ్లుగా పాలించిన చంద్రబాబును ప్రశ్నించకుండా ప్రతిపక్షాలను ప్రశ్నించడం ఏమిటన్నారు. మొన్నటి వరకు ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ చిచ్చుపెట్టిన పవన్‌ కల్యాణ్… ఇప్పుడు ఏకంగా రెండు రాష్ట్రాల మధ్య నిప్పు రాజేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే పవన్ కల్యాణ్ బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. భావి తరాల జీవితాలను నాశనం చేసేందుకు పవన్‌ కల్యాణ్ రాజకీయం చేస్తున్నారన్నారు.

First Published:  24 March 2019 2:00 AM GMT
Next Story