అల్లు అర్జున్ కొత్త కారవాన్ విలువ తెలిస్తే షాక్ అవుతారు

‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ లాంటి పరాజయం తర్వాత అభిమానులని చాలా రోజులు వెయిట్ చేయించాడు అల్లు అర్జున్. ఎట్టకేలకు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించగానే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికే ఇద్దరూ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలతో మన ముందుకు రావడంతో, వీరి తదుపతి చిత్రం పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం బన్నీ తరుచుగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడట. ఈ సినిమాకి సంబంధించి చేస్తున్న పాత్ర కోసం బన్నీ బరువు తగ్గి సన్నగా కనిపించాలట. అందుకే బన్నీ రోజూ కష్ట పడుతూ స్లిమ్ అవ్వాలనే ధ్యేయం తో ఉన్నాడట. మరి కొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుండడంతో అల్లు అర్జున్ తో పాటు అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా మొదలు కాక ముందే అల్లు అర్జున్ ఒక కొత్త కారవాన్ కొనుకున్నాడట. అక్షరాల ఏడు కోట్లు విలువ చేసే ఈ కారవాన్ లో అన్ని సదుపాయాలూ ఉన్నాయట.

ఇంతటి విలువైన, అధునాతన కారవాన్ ను సొంతం చేసుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీ అల్లు అర్జున్ అని తెలిసింది. కారవాన్ పైన అల్లు అర్జున్ స్టైల్ ‘ఏఏ సిగ్నేచర్’ యూనిక్ గా ఉండబోతుందట.

పూజా హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించనున్నది. గీత ఆర్ట్స్ మరియు హారిక, హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. సునీల్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.