మరొక రికార్డ్ సాధించిన ‘బాహుబలి’

తెలుగు ఇండస్ట్రీ లో కొత్త రికార్డులను నమోదు చేసిన ‘బాహుబలి 1’ చిత్రానికి ఒక ఊహించని గౌరవం దక్కింది. అతి ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ ఫిల్మ్ కాన్సర్ట్ లో ఈ చిత్రం ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు ‘బాహుబలి 1’ ని కూడా ప్రదర్శించడం విశేషం.

‘స్కైఫాల్’, ‘హరీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్’ లాంటి ఇంగ్లీష్ సినిమాలతో పాటు ‘బాహుబలి 1’ సినిమా కూడా ఎంపికైంది. అంతేకాక సినిమా ప్రదర్శన కు ముందు ఒక లైవ్ కాన్సర్ట్ కూడా జరుగుతుంది.

అక్టోబర్ 19న జరగనున్న ఈ వేడుకలో రాజమౌళి, చిత్రానికి సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి కూడా హాజరవ్వనున్నారు. కాన్సర్ట్ లో భాగంగా అక్కడివారితో ఇంటరాక్ట్ అయ్యి చిత్ర విషయాలని చెప్పనున్నారు. చిత్ర సంగీతం గురించి కొన్ని విశేషాలు ఈ వేడుకలో పంచుకోనున్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ కాన్సర్ట్ లో ప్రదర్శింప పడనున్న మొట్టమొదటి భారతీయ చిత్రం ‘బాహుబలి 1’.