Telugu Global
NEWS

నా ఆస్తి లక్ష కోట్లు : నిజం ఒప్పుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడివిట్ లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తులు కేవలం 20 కోట్లు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల విలువ లక్ష కోట్లు. నమ్మలేక పోతున్నారా ఇది ముమ్మాటికి నిజం. ఆదివారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తి లక్ష కోట్ల రూపాయలని ప్రకటించారు. “ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి […]

నా ఆస్తి లక్ష కోట్లు : నిజం ఒప్పుకున్న చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడివిట్ లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తులు కేవలం 20 కోట్లు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల విలువ లక్ష కోట్లు. నమ్మలేక పోతున్నారా ఇది ముమ్మాటికి నిజం.

ఆదివారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తి లక్ష కోట్ల రూపాయలని ప్రకటించారు. “ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్దికి 500 కోట్లు ఇద్దామని అనుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.

అయితే అమరావతి రాజధానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మట్టి, నీరు తీసుకురావడంతో నేను 500 కోట్లు ఇస్తే బాగోదని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ఇచ్చే 500 కోట్లు ఎవరికి కావాలి? నా ఆస్తి విలువ లక్ష కోట్లు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసింత గర్వంగా…. ఒకింత ఆవేశంగా అన్నారు.

తాను ప్రజల కోసమే పనిచేస్తానని, తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఇన్నాళ్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో “లక్ష కోట్లకు అధిపతిని” అని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్కయ్యారు.

తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలకు మాత్రమే వ్యాపారాలు ఉన్నాయని, తాను ప్రజాసేవకే అంకితమయ్యానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు ఆవేశంలో అసలు విషయాన్ని కక్కేసారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లక్ష కోట్లు ఉన్నాయంటూ ఇంత వరకూ గోబెల్స్ ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు…. తన ఆస్తి లక్ష కోట్లని ప్రకటించడం పట్ల తెలుగుదేశం పార్టీలో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇదా చంద్రబాబు నాయుడి ముసుగు. చంద్రబాబు నాయుడు ఆవేశంలోనైనా తన ఆస్తి వివరాలు వెల్లడించారు. ఇక ముందు ముందు ఆయనను లక్షకోట్ల బాబు అని పిలవాల్సి ఉంటుంది” అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు.

First Published:  25 March 2019 12:33 AM GMT
Next Story