పవన్ కోసం సాయి ధరమ్ తెలివైన ప్రమోషన్

ఇప్పటికే చిత్రలహరి చిత్రం నుండి మొదటి సాంగ్ అందరినీ అలరించిన నేపథ్యంలో చిత్ర వర్గాలు రెండో సాంగ్ తో ముందుకొచ్చారు. ఆల్రెడీ గ్లాస్మేట్స్ తో వస్తోన్న ఈ పాట కి ముందు నుండే విపరీతమైన ప్రమోషన్ చేశారు.

ఈ మధ్య కాలం లో ఒక లిరికల్ వీడియోకి ఇంత రేంజ్ ప్రమోషన్ అస్సలు చేయలేదు. అయితే నిన్న సాంగ్ రిలీజ్ అయితే కానీ అసలు విషయం బోధ పడలేదు.

ఖమ్మం లో చిత్రలహరి సినిమా యూనిట్ సందడి చేసి అక్కడ ఈ సినిమాకి సంబంధించిన పాటని విడుదల చేశారు. ఖమ్మం లో ఎందుకు విడుదల చేశారో తెలియదు కానీ సాంగ్ ని మాత్రం సాయి ధరమ్ తేజ్ తెలివిగా వాడుకుంటూ పవన్ కళ్యాణ్ కి ప్రచారం ఇస్తున్నాడు.

అయితే గ్లాస్ జనసేన పార్టీ గుర్తు కావడం, పవన్ కళ్యాణ్ కి సాయి ధరమ్ తేజ్ బాగా సన్నిహితం గా ఉండడం, అలాగే సాయి ధరమ్ అనేక సార్లు పవన్ కి అనుకూలం గా మాట్లాడడం…. అన్నీ చూస్తే ఈ గ్లాస్ మేట్స్ సాంగ్ లో గ్లాస్ అనేది హైలైట్ చేస్తూ ఫొటోస్ కూడా విడుదల చేస్తూ ఇన్ డైరెక్ట్ గా జనసేన కి ప్రచారం చేస్తున్నారు అనేది అర్ధం అవుతూ ఉంది.

అందరూ ఒక పద్ధతి ఫాలో అయితే మెగా సుప్రీం హీరో మాత్రం చాలా తెలివిగా తన మామయ్యకి హెల్ప్ చేస్తున్నాడు అన్న మాట.