వైసీపీ అభ్యర్థికి హైకోర్టులో ఊరట

హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్దమైన గోరంట్ల మాధవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలంటూ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసింది.

మాధవ్‌పై చార్జ్ మెమోలు పెండింగ్‌లో ఉన్నందున రాజీనామా ఆమోదించలేదని ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్ధించలేదు. మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని స్పష్టం చేసింది.

గోరంట్ల మాధవ్‌ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తీర్పును ఇచ్చింది. ఇప్పటికే మాధవ్‌, ఆయన భార్య ఇద్దరూ నామినేషన్ వేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాధవ్‌ నామినేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది.