పండగ చేసుకున్న ఇస్మార్ట్ శంకర్

యూనిట్ లో ఒక్క హీరోయిన్ ఉంటేనే పూరి జగన్నాధ్ ను పట్టలేం. అలాంటిది చార్మితో కలుపుకొని ముగ్గురు ముద్దుగుమ్మలు. ఇంకేముంది ఇస్మార్ట్ శంకర్ యూనిట్ లో ఒకటే హంగామా. దీనికి తోడు నిన్న రాత్రి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు యూనిట్ అంతా. దీనికి ఓ కారణం ఉంది.

రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి గోవాలో భారీ షెడ్యూల్ జరిపారు. నిన్నటితో ఆ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఓవైపు షెడ్యూల్ పూర్తయిందన్న ఆనందం, మరోవైపు గోవా లాంటి టూరిస్ట్ స్పాట్. ఇంకేముంది తమ ఆనందాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది యూనిట్. తమ పార్టీకి సంబంధించి ఓ స్టిల్ ను కూడా చార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ పార్టీలో హీరో రామ్, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, మరో నిర్మాత చార్మితో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ కూడా పాల్గొన్నారు. వీళ్లతో పాటు పూరి తనయుడు, ప్రస్తుతం రొమాంటిక్ అనే సినిమా చేస్తున్న ఆకాష్ పూరి కూడా ఉన్నాడు.