Telugu Global
NEWS

ఎంత వాడుకుంటారు మెగా బ్రదర్స్? " వారి సామాజిక వర్గం ప్రశ్న!

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించారు. ఇక తమకు తిరుగు ఉండదని, ఓ సామాజిక వర్గం చేతిలో ఇన్నాళ్లూ బందీలుగా ఉన్న తమకు తమ సామాజిక వర్గమే రాజకీయ పార్టీగా అవతరించింది అని ఆనందపడ్డారు. పైగా సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు, కులాలకు, యువతీ యువకులకు ఎంతో ఇష్టుడైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో రాష్ట్రంలో అన్ని వర్గాల వారి మద్దతు ఉంటుందని ఆనందపడ్డారు. కుల రాజకీయాలు మాత్రమే నడిచే తెలుగు రాష్ట్రంలో తమ కులం కూడా […]

ఎంత వాడుకుంటారు మెగా బ్రదర్స్?  వారి సామాజిక వర్గం ప్రశ్న!
X

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించారు. ఇక తమకు తిరుగు ఉండదని, ఓ సామాజిక వర్గం చేతిలో ఇన్నాళ్లూ బందీలుగా ఉన్న తమకు తమ సామాజిక వర్గమే రాజకీయ పార్టీగా అవతరించింది అని ఆనందపడ్డారు.

పైగా సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు, కులాలకు, యువతీ యువకులకు ఎంతో ఇష్టుడైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో రాష్ట్రంలో అన్ని వర్గాల వారి మద్దతు ఉంటుందని ఆనందపడ్డారు. కుల రాజకీయాలు మాత్రమే నడిచే తెలుగు రాష్ట్రంలో తమ కులం కూడా ఓ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాదు ప్రజారాజ్యం పార్టీని భుజాలకెత్తుకొని మోసారు.

కటౌట్లు పెట్టి, జెండాలు కట్టి, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యాన్ని తమ ఇంటి పార్టీ గా చేసుకున్నారు ఆ సామాజిక వర్గం వారు. 2009 సంవత్సరంలో ఎన్నికల ప్రకటన వెలువడే వరకు చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారందరూ ప్రజారాజ్యం పార్టీని “కాపు” కాయాలనే అనుకున్నారు.

తీరా ఎన్నికలు ప్రకటించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అసలు స్వరూపం బయటపడి కాపు కాయాలనుకున్న ఆ సామాజిక వర్గం అవాక్కయ్యింది. పోనీలే రాజకీయ అనుభవం లేదని ఆనాడు ఆ సామాజిక వర్గం నాయకులు, యవతీ యువకులు సరిపెట్టుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో అలిగిన ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేశారు పవన్ కళ్యాణ్. దీంతో ప్రజారాజ్యం పార్టీ పోయినా అయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం తమ వాడేనని ఆ సామాజిక వర్గం మరోసారి వారిని అక్కున చేర్చుకుంది.

రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఎంతో ఆగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేయనని ప్రకటిస్తూనే… రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అనేక రాయితీలను ప్రకటిస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీకి, వారి మద్దతు తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బహిరంగంగానే మద్దతు పలికారు పవన్ కళ్యాణ్.

సరే…. రాష్ట్రం కష్టాల్లో ఉంది కదా! అనే ఒకే ఒక్క సానుభూతి, అన్న మోసం చేసినా తమ్ముడు అలా చేయడనే నమ్మకంతో ఆ సామాజిక వర్గం తిరిగి పవన్ కళ్యాణ్ కు, ఆయన మద్దతు పలికిన పార్టీలకు “కాపు” కాసింది. ఎన్నికలు ముగిశాయి.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మెగా బ్రదర్స్ “కాపు” కాసిన సామాజిక వర్గంలో కూడా ఎలాంటి మార్పు రాలేదు. ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి 2019లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి నేరుగా పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు.

ఎన్నికల ప్రచారంలోనూ, అభ్యర్థుల ప్రకటనలోను చిరంజీవి కంటే భిన్నత్వాన్ని చూపించిన పవన్ కళ్యాణ్ తమకు ఏదో చేస్తారు అని ఆ సామాజిక వర్గం ఆశపడింది.

అయితే గడచిన వారం రోజుల నుంచి వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. వారు కన్న కలలు కల్లలవుతున్నాయి. దీంతో అన్నను మించి పవన్ కళ్యాణ్ కూడా తమను మోసం చేసి లోపాయికారిగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, యువతీ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“ఇన్నాళ్లూ మీ అన్నదమ్ములను నమ్మాం. మీరు మోసం చేస్తున్నారు. ఇంకా మిమ్మల్ని ఎన్నాళ్లు నమ్మాలి మెగా బ్రదర్స్” అంటూ మండిపడుతున్నారు.

First Published:  24 March 2019 11:00 PM GMT
Next Story