Telugu Global
Cinema & Entertainment

చరణ్ హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్

వరుసగా మూడు ఫ్లాపులొచ్చినా అఖిల్ తగ్గట్లేదు. మిస్టర్ మజ్ను ఫ్లాప్ అయినప్పటికీ వెంటనే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు, ఆ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు కూడా. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ తన నెక్ట్స్ సినిమాలో కైరా అద్వానీతో కలిసి నటించబోతున్నాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. సినిమాకు సంబంధించి ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఇందులో […]

చరణ్ హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్
X

వరుసగా మూడు ఫ్లాపులొచ్చినా అఖిల్ తగ్గట్లేదు. మిస్టర్ మజ్ను ఫ్లాప్ అయినప్పటికీ వెంటనే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు, ఆ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు కూడా. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ తన నెక్ట్స్ సినిమాలో కైరా అద్వానీతో కలిసి నటించబోతున్నాడు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. సినిమాకు సంబంధించి ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఇందులో కైరా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ ప్రకటన కూడా ఇంకా అధికారికంగా రాలేదు. ఒకేసారి ఈ రెండు విషయాల్ని ప్రకటించాలనుకుంటోంది యూనిట్.

తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కైరా అద్వానీ. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చరణ్ నటించిన వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇలా ఒక హిట్, ఒక ఫ్లాప్ తో ఉన్న టైమ్ లో అఖిల్ సినిమాకు ఓకే చెప్పింది కైరా. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కాస్త పెద్దగానే ఉంటాయి. సో.. ఈ సినిమాలో కైరాకు మంచి పాత్ర దొరికిందనే భావించాలి.

First Published:  24 March 2019 11:22 PM GMT
Next Story