లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పెద్ద పరీక్ష నేడు

వివాదాల కి ఎప్పుడూ ముందు ఉండే దర్శకుడు లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రం తో మన ముందుకు రానున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో మూడో భాగం గా, లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితం లో కి ప్రవేశించిన తర్వాత నుండి ఏం జరిగింది అనే విషయాలని ఈ సినిమా లో చూపించబోతున్నట్టు ఆల్రెడీ వర్మ చెప్పేసాడు.

సినిమా కి సంబంధించిన ట్రైలర్స్, పాటలు ఇప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేసాయి. ఇక సినిమా సెన్సార్ అవ్వడమే తరువాయి అనుకుంటున్నా తరుణం లో కొన్ని నాటకీయ పరిణామాలు జరగడం, సెన్సార్ బోర్డ్ ముందుగా సినిమా చూడలేము అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళి సెన్సార్ చేస్తాము అని డేట్ ఇవ్వడం తో సమస్య సద్దుమణిగింది.

అయితే సెన్సార్ బోర్డు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సినిమాని చూడాల్సిందే. ఎందుకంటే గత వారం జరిగిన ఆడిటింగ్ ప్రకారం ఈ సినిమా ని చూడకుండా సెన్సార్ బోర్డు వేరే సినిమాలు చూడడానికి లేదు. ముందుగా ఈ సినిమా కి సెన్సార్ నిర్వహించి, సర్టిఫికెట్ ఇష్యూ చేసాక నే వేరే సినిమా లని చూడాలి.

అందుకే ఈ రోజు ఉదయం స్లాట్ లో ఈ సినిమా ని సెన్సార్ బోర్డు చూడనున్నది అని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ సినిమా 29 న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.