ఒకేసారి రెండు సినిమాలు ఓకే చేశాడు

ఇప్పుడు హీరోలంతా ట్రెండ్ మార్చారు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా ఓకే చేసే పద్ధతికి స్వస్తి పలికారు. కుదిరితే ఒకేసారి రెండు సినిమాలు ఎనౌన్స్ చేసి, ఒక దాని తర్వాత ఇంకోటి పూర్తిచేసే పనిలో పడుతున్నారు.

దీనివల్ల రెండు ఉపయోగాలు. ఒకటి తమ అభిమాన హీరోపై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు ఉండవు. ఇక రెండోది, కాల్షీట్లు సర్దుబాటు చేయడంలో హీరోలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే చేశాడు.

ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ ను క్లైమాక్స్ కు తీసుకొచ్చిన మహేష్ బాబు, తను చేయబోయే రెండు సినిమాల్ని ఒకేసారి ప్రకటించాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు మహేష్ క్లారిటీ ఇచ్చాడు.

మహేష్ ఇలా ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించడంతో సుకుమార్ తో అతడు చేయాల్సిన ప్రాజెక్టుపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాదాపు ఏడాదిన్నర వరకు మహేష్ తో ఇక సుకుమార్ సినిమా చేయలేడు. ఆ తర్వాతైనా సుకుమార్ తో సినిమా చేస్తాడా, లేక అప్పటికి మరో దర్శకుడు లైన్లోకి వస్తాడా అనేది చూడాలి. మరోవైపు మహేష్ ఇలా ఒకేసారి రెండు సినిమాలపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.