Telugu Global
NEWS

సోషల్ మీడియాను ఊపేస్తున్న మంగళగిరి మాలోకం సెల్ఫీ

నారా లోకేష్ ఏం చేసినా నెటిజన్లకు పండగగా మారుతోంది. నారా లోకేష్ ప్రసంగంలో ఎక్కడ నోరు జారుతారా… అని చాలా మంది ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇటీవల మంగళగిరి ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ దిగిన సెల్ఫీ కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రచారానికి వెళ్లిన లోకేష్ అక్కడి ప్రజల కోరిక మేరకు సెల్ఫీ దిగేందుకు సెల్ ఫోన్ తీసుకున్నారు. అయితే ముఖానికి ఎండపడుతుండడంతో చేయి ముఖానికి అడ్డుపెట్టుకుని సెల్ఫీ దిగారు. అంతే ముఖానికి […]

సోషల్ మీడియాను ఊపేస్తున్న మంగళగిరి మాలోకం సెల్ఫీ
X

నారా లోకేష్ ఏం చేసినా నెటిజన్లకు పండగగా మారుతోంది. నారా లోకేష్ ప్రసంగంలో ఎక్కడ నోరు జారుతారా… అని చాలా మంది ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.

ఇటీవల మంగళగిరి ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ దిగిన సెల్ఫీ కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రచారానికి వెళ్లిన లోకేష్ అక్కడి ప్రజల కోరిక మేరకు సెల్ఫీ దిగేందుకు సెల్ ఫోన్ తీసుకున్నారు.

అయితే ముఖానికి ఎండపడుతుండడంతో చేయి ముఖానికి అడ్డుపెట్టుకుని సెల్ఫీ దిగారు. అంతే ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని సెల్ఫీ దిగడం ఏమిటని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు లోకేష్‌ను ఆదర్షంగా తీసుకుని ఫన్నీగా చాలా మంది ఇదే తరహాలోనే సెల్ఫీ దిగి పోస్టు చేస్తున్నారు.

ఈ సెల్ఫీకి పేరు కూడా పెట్టారు. ‘మంగళగిరి మాలోకం సెల్ఫీ’ అని పేరు పెట్టేశారు. పెళ్లిళ్లలో కూడా ఆఖరిలో ‘మంగళగిరి మాలోకం సెల్ఫీ’ తప్పనిసరి అయిపోయింది. మొత్తం మీద లోకేష్ సెల్ఫీ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది.

First Published:  24 March 2019 7:02 PM GMT
Next Story