నిర్మాత నాగార్జున, పర్యవేక్షణ సమంత

ఈరోజు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు నాగార్జున. ఎన్నాళ్లనుంచో నలుగుతున్న రాహుల్ రవీంద్రన్ ప్రాజెక్టు ఇది. దీని పేరు మన్మధుడు-2. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఈ మూవీ అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై రావడం లేదు. అవును.. నాగార్జునకు చెందిన మరో నిర్మాణ సంస్థ మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అంటే నాగార్జున, జెమినీ కిరణ్ నిర్మాతలన్నమాట. ఇక్కడ పేరుకే నాగార్జున నిర్మాత, వ్యవహారాలన్నీ సమంత
చూసుకోబోతోంది.

అవును.. మన్మధుడు-2 సినిమాకు సంబంధించి జెమినీ కిరణ్ తో కలిసి నిర్మాణ వ్యవహారాలన్నీ సమంత చూసుకోబోతోంది. ఈ మేరకు సమంతను లైన్లోకి తీసుకొచ్చాడు నాగార్జున. ఈ ప్రాజెక్టు కనుక నిర్మాణపరంగా సక్సెస్ అయితే, మనం ఎంటర్ ప్రైజస్ ను సమంతకు అప్పగించే ఆలోచనలో ఉన్నాడట నాగ్. అందుకే ప్రయోగాత్మకంగా మన్మధుడు-2 సినిమాను సమంత చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది.

చూస్తుంటే.. సమంతను మెల్లగా యాక్టింగ్ కెరీర్ నుంచి సైడ్ చేయాలని అక్కినేని కాంపౌండ్ భావిస్తున్నట్టుంది. ఇప్పటికే ఆమె స్టార్ హీరోల సినిమాల్లో నటించడం మానేసింది. నటనకు ఆస్కారముండే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. మరోవైపు భర్తతో కలిసి నటిస్తోంది. సమంత కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.