రాధ రవి కి విశాల్ కౌంటర్

తమిళ్ సినిమా పరిశ్రమలో అందరూ సీనియర్ నటుడు రాధ రవి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతార కి సంబంధించిన ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఆయన నయనతార మీద కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ చేయడం తో ఇతర నటులు, పరిశ్రమ వర్గాలు, అభిమానులు అసంతృప్తి గా ఉన్నారు.

రాధ రవి ని అన్ని అసోసియేషన్స్ నుండి తొలగించాలని, ఆయన్ని ఇటువంటి సినిమా ఈవెంట్స్ కి అస్సలు పిలవధ్ధు అని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంగం తరపు నుండి ప్రెసిడెంట్ విశాల్ రాధ రవికి లేఖ పంపారు. ఆయన కామెంట్స్ ని ఆయన వెనక్కి తీసుకోవాలని విశాల్ తేల్చి చెప్పాడు.

ఈ విషయమై సోషల్ మీడియా లో కూడా విశాల్ తన వాదన ని వివరించాడు. “డియర్ రాధ రవి సర్, ఒక నడిగర్ సంగం తరపు నుండి మీరు చేసిన పని ని ఖండించాలని ఉంది మాకు. మీకు మా నుండి లేఖ పంపాము. ఇప్పటికైనా ఎదగండి. ఇక పై మీరు రవి అని అందరితో పిలిపించుకోండి. మీ పేరు కు ముందు ఉన్న రాధ కూడా ఒక మహిళ పేరే” అని విశాల్ అన్నాడు. అలాగే డీఎంకే పార్టీ ప్రథమ సభ్యత్వం నుండి రాధ రవి ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు కూడా.